ప్లీనరీలో ఉమ్మడి జిల్లా నేతల సందడి

ABN , First Publish Date - 2021-10-26T04:29:13+05:30 IST

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగిన

ప్లీనరీలో ఉమ్మడి జిల్లా నేతల సందడి
ప్లీనరీ వేదికపైకి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి

  • సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన సబితారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్రసమితి ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ)కి ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు భారీగా తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రసమితి ద్విదశాబ్ధి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సభకు అనుమతి ఉన్న ప్రతినిధులతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. దీంతో హైటెక్స్‌లో ఉమ్మడిజిల్లా నేతల సందడి ఎక్కువ కనిపించింది. ప్లీనరీకి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జడ్పీ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు హాజరయ్యారు. ప్లీనరీ వేదికపైకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి, ఆహ్వాన కమిటీ అధ్యక్షురాలు సబితాఇంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఈసంద ర్భంగా పార్టీ స్థాపించిన నాటి  నుంచి వరుసగా 9వ సారి పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సీఎం కేసీఆర్‌కు మంత్రి సబితారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉమ్మడిజిల్లాకు చెం దిన మరో మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. సభలో దళితబంధుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ మేక కథ చెప్పి అందరినీ నవ్వించారు. సీఎం కేసీఆర్‌ కూడా నవ్వారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరూ తన బంధువులేనంటూ సీఎం కేసీఆర్‌.. దళితబంధువు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. గతపాలకులు దళితులను పట్టించుకోలేదని, వారి బాధలను చూసి చలించిన కేసీఆర్‌ దళితబంధు పథకానికి అంకురార్పణం చేశారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. Updated Date - 2021-10-26T04:29:13+05:30 IST