అనంతగిరిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-12-26T05:12:45+05:30 IST

అనంతగిరిలో భక్తుల సందడి

అనంతగిరిలో భక్తుల సందడి
ఆలయంలో భక్తుల సందడి

వికారాబాద్‌ : అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామిని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ సుబ్రహ్మణ్యం శర్మ దర్శించుకున్నారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సమేతంగా అభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఆయా ఆలయాల ప్రతినిధులు, అర్చకులు వారికి స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆలయ చరిత్ర, విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, అతి పురాతనమైన దేవాలయాలను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కాగా శనివారం సెలవుదినం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అనంతరం ఆలయ సమీపంలో గల ఎత్తయిన కొండలు, హరితవనాలు, లోయలు, ప్రకృతి అందాలనుపర్యాటకులు ఆస్వాదించారు. ఫొటోలు, సెల్ఫీలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

Updated Date - 2021-12-26T05:12:45+05:30 IST