నిరాడంబరంగా రామభద్రక్షేత్రం వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

నిరాడంబరంగా రామభద్రక్షేత్రం వార్షికోత్సవం

నిరాడంబరంగా రామభద్రక్షేత్రం వార్షికోత్సవం
కేశవరంలో కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీపీ హరికమురళీగౌడ్‌

మూడుచింతలపల్లి: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రామభద్రక్షేత్రంలో ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా ప్రారంభించారు. శుక్రవారం ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్‌ నిబంఽధనలు పాటిస్తూ ఆగమ పండితులు, అర్చక స్వాములతో శాస్ర్తీయంగా గణపతి పూజ ధ్వజారోహణ, హోమం, తదితర పూజలను ఆగమ పద్ధతిలో ప్రారంభించినట్లు శ్రీరామభద్రక్షేత్ర, శ్రీశంకర చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు బ్రహ్మ శ్రీ సంతోష్‌ పండరీ శర్మ తెలిపారు. అదేవిధంగా మండలంలోని కేశవరం గ్రామంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హారికమురళీగౌడ్‌ ముఖ్య అతిఽథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జ్యోతిబలరామ్‌, ఎంపీటీసీ హనుమంతరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST