సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్‌ సందేశం

ABN , First Publish Date - 2021-08-20T05:44:25+05:30 IST

సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్‌ సందేశం

సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్‌ సందేశం
ఓం శాంతి కేంద్రంలో వేడుకల్లో మాట్లాడుతున్న మధు అక్కయ్య

వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ప్రతి ఒక్క రూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్‌ఉద్దేశ్యమని ఓంశాంతి కేంద్రం నిర్వాహకురాలు బ్రహ్మకుమారి మధు అక్కయ్య అన్నారు. గురువారం ఆమె పండగ విశిష్టతను వివరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. పరస్పర మాటలు, దృష్టి స్వభావ సంస్కారాలు నిష్కల్మషంగా ఉండాలనే రాఖీ కట్టి మిఠా యి తినిపిస్తారని తెలిపారు. అతిథిగా హాజరైన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల మాట్లాడుతూ సేవతో ప్రజల్లో ప్రేమతత్వం, శాంతి పెంపొందించేందుకు బ్రహ్మకుమారీస్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్పారు. హాజరైన వారందరికీ మధు అక్కయ్య రాఖీలు క ట్టారు. కార్యక్రమంలో బీకేలు భారతి, పావని, మాజీ వైస్‌చైర్మన్లు రమేష్‌కుమార్‌, హెచ్‌.సురేష్‌, కౌన్సిలర్లు స్వాతి, శ్రీదేవి, గాయత్రి, మంజుల, నజ్రీన్‌, రామస్వా మి,చందర్‌నాయక్‌, బాల్‌రాజ్‌,సదా నందం,సురేష్‌ పాల్గొన్నారు.

  • రక్షాబంధన్‌ వేడుకలు

బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో రక్షా బంధ న్‌ వేడుకలను నిర్వహించారు. మధు అక్కయ్య ఎస్పీ నారాయణ, ఇతర అధికారులకు రాఖీ కట్టారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బ ంది కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T05:44:25+05:30 IST