ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-21T03:52:54+05:30 IST
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

దోమ: కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన బాసుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జి.సత్తెయ్య(47) భార్య శంకరమ్మ, తన ఇంటి పక్కన ఉన్న ఓ ఇంట్లో బంగారం చోరీకి పాల్పడింది. ఈ విషయంపై ఇరు కుటుంబాల సభ్యులు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో తన బంగారమైనా ఇవ్వాలి లేదా డబ్బులైనా ఇవ్వాలని బాధితులు పట్టుబట్టారు. దీంతో సత్తెయ్య మనస్తాపానికి గురై గురువారం తన ఇంటి ఆవరణంలో రేకుల షెడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.