పోలీసుల మానవత్వం
ABN , First Publish Date - 2021-03-24T05:40:43+05:30 IST
పోలీసుల మానవత్వం

- అనారోగ్యంతో ఉన్న యవతిని అసుపత్రికి తరలింపు
కొత్తూర్: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి పోతూ మార్గమధ్యంలో కొత్తూర్‌లో దిగి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతిని పోలీసులు చేరదీసి అసుపత్రికి తరలించారు. ఏఎ్‌సఐ అబ్దుల్లా తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కల్మన్‌కల్‌కు చెందిన పూజ(18) నాలుగు రోజుల క్రితం నగరంలోని చా ర్మినార్ ప్రాంతంలో ఉండే బంధువుల వద్దకు వెళ్లింది. సోమవారం సాయంత్రం పూజకు ఫిట్స్ వచ్చి అనారోగ్యానికి గురైంది. బంధువులు పూజకు డబ్బులిచ్చి స్వగ్రామానికి వెళ్లాలని సూచించారు. పూజ బస్సు ఎక్కి తికమక పడి మార్గమధ్యలో కొత్తూర్‌లో దిగి రాత్రి ఎంఆర్‌సీ భవనం వద్ద నిద్రించింది. మంగళవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎ్‌సఐ చేరుకుని పూజను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కల్మన్‌కల్‌లోని కుటుంబసభ్యులతో పాటు చార్మినార్ లో ని బంధువులకు సమాచారం ఇచ్చారు. పూజ కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. పూజకు వైద్యం చేయించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.