మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-03-24T05:37:08+05:30 IST

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం:కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న పీఆర్టీయూ నాయకులు

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపంచడమే దీనికి నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30శాతం పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయసు పెంపుతో ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పీఆర్‌టీయూ-టీఎస్‌ ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. కరోనా కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైనా వారికి మంచి పీఆర్‌సీ ఇచ్చందన్నారు. మండల పరిషత్‌  ఉద్యోగులు, ఉపాధ్యాయులు కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం చేసి మిఠాయి పంచుకున్నారు. ఎంపీపీ కృపేష్‌, వైస్‌ ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతా్‌పరెడ్డి, పంచాయతీ అధికారి మహేష్‌, పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం ఇంద్రసేనారెడ్డి, ఎంఈవో కె.వెంకట్‌రెడ్డి, వ్యవసాయాధికారి వరప్రసాద్‌రెడ్డి, సీడీపీవో జి.శాంతిశ్రీ, పీఆర్టీయూ పరమేష్‌ పాల్గొన్నారు.


  • మాట నిలుపుకున్న కేసీఆర్‌..


ఆమనగల్లు: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపు కుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో వాణీదేవి గెలుపునకు కృషిచేసిన దివ్యాంగుల సంఘం నాయకుడు బొడ్డు శంకర్‌ను మంగళవారం ఆయన నగరంలోని తన నివాసంలో శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉందని జైపాల్‌యాదవ్‌ అన్నారు. 30శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించి, ఉద్యోగ విరమణ వయస్సును 61ఏళ్లకు పెంచిందని తెలిపారు. యువత ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు బీచ్యానాయక్‌, వాణిశ్రీ, కంబాలపల్లి అంజి పాల్గొన్నారు.


  • శంకర్‌పల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం


శంకర్‌పల్లి: కేసీఆర్‌ ప్రభత్వం ఉద్యోగులకు పీఆర్‌సీని ప్రకటించడం హర్షనీయమని శంకర్‌పల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి ప్రధానచౌరస్తాలో మున్సిపల్‌ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఆశావర్కర్లతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమలో తహసీల్దార్‌ కృష్ణకుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T05:37:08+05:30 IST