కులవృత్తుల ఆదరణకు ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-07-09T04:49:31+05:30 IST

కుల వృత్తు లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని

కులవృత్తుల ఆదరణకు ప్రభుత్వం కృషి
అల్లవాడలో గొర్రెలను పంపిణీ చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

  • విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి


చేవెళ్ల / శంకర్‌పల్లి : కుల వృత్తు లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండలం అల్లవాడలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్య క్రమంలో భాగంగా రూ.52.5 కోట్ల విలు వగల గొర్రెలను 42మంది లబ్ధిదారులకు మంత్రి అందించారు. ఈసందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ. చేవెళ్ల నియోజకవర్గంలో 5వేల మంది లబ్ధిదారులు గొర్రెల కోసం దరఖాస్తు చేసుకోగా, 2,665మందికి పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారం దరికీ రెండో విడతలో అందిస్తామన్నారు. సర్కార్‌ బడుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, డ్రెస్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.80కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కోసం రూ.4వేల కోట్లు అందిస్తుందన్నారు.


రాష్ట్ర అభివృద్ధే సీఎం ధ్యేయం

సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. గురువారం శంకర్‌పల్లి మండలంలోని గోపులారం, దొంతాన్‌పల్లి, మహారాజ్‌పేట్‌, మహాలింగపురం, లక్ష్మారెడ్డిగూడ, శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని బుల్కాపురం, క్రిస్టల్‌ గార్డెన్లలో పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా హరితహారం మొక్కలను నాటారు. గోపులారంలో స్వయం సహాయక మహిళలకు మంజూ రైన దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం కింద కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.12 వేల కోట్లతో దళితులకు ప్రత్యేక పథకం రూపొందించారన్నారు. కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పశుసంవర్థశాఖ అధికారి అంజిలప్ప, ఆర్‌డీవో వేణుమాధవ్‌రావు, సదానందం, తిరుపతిరెడ్డి, విజయలక్ష్మి, కర్నె శివప్రసాద్‌, మాలతి, శివలీల, బీంరెడ్డి, సత్య నారాయణచారి, హరీశ్‌కుమార్‌, అక్బర్‌, కృష్ణయ్య, జగన్‌రెడ్డి, గీతశ్రావంతి, అనూష, శిరీష, రమణారెడ్డి, ప్రభాకర్‌, రవికాంత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, గోవిందమ్మగోపాల్‌రెడ్డి, సాత విజయలక్ష్మి, పొడువు శ్రీనివాస్‌, నర్సింహారెడ్డి, అశ్విని పాల్గొన్నారు. Updated Date - 2021-07-09T04:49:31+05:30 IST