కంటి వైద్యశిబిరం విజయవంతం

ABN , First Publish Date - 2021-12-30T05:40:52+05:30 IST

కంటి వైద్యశిబిరం విజయవంతం

కంటి వైద్యశిబిరం విజయవంతం

కొడంగల్‌  రూరల్‌: జిల్లా అంధత్వ నివారణ సంస్థ, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కొడంగల్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతమైంది. బుధవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన శిబిరాన్ని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ప్రారంభించారు. 80మందికి పరీక్షలు నిర్వహించారు. 30 మందిని శస్త్ర చికిత్స కోసం మహబూబ్‌నగర్‌లోని రాంరెడ్డి కంటి ఆసుపత్రికి రెఫర్‌ చేసినట్లు వైద్యులు హరినాథ్‌ నెహ్రూ, గోపాల్‌ తెలిపారు. కార్యక్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే రుక్మారెడ్డి మనుమడు సుచిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T05:40:52+05:30 IST