వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-25T04:42:23+05:30 IST

వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల అదృశ్యం

వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల అదృశ్యం

కందుకూరు: వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన బుధవారం కందుకూరు పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు గ్రామానికి చెందిన పంబాల సుజాత(25) జనవరి 28న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి బాల య్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కందుకూరు మండల కేంద్రానికి చెందిన చిట్టెమ్మ(19) ఐదు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇప్పటివరకూ రాలేదని భర్త ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఎస్సై స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-25T04:42:23+05:30 IST