యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2021-07-09T05:18:14+05:30 IST
యువకుడి అదృశ్యం

పూడూరు: మండలంలోని కంకల్ గ్రామంలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన అంజయ్య కుమారుడు కర్రె శ్రీనివాస్(34) గత వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు వారం రోజులుగా బంధువులు, స్నేహితులను ఆరాతీసినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం చన్‌గోముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9849412071, 9908651560 నెంబర్లకు డయల్ చేయాలని కోరారు.