గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-12-30T05:32:45+05:30 IST
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ఘట్‌కేసర్ రూరల్/ఘట్‌కేసర్ : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవుశాపూర్‌లో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కింద రూ.16లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో అవుశాపూర్, మాదారం, మర్రిపల్లిగూడ, ఘణాపూర్, వెంకటపూర్, చౌదరిగూడ, కొర్రెముల, కాచవానిసింగారంలో రూ.10లక్షల చొప్పున వెచ్చించి సీసీ రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో అరుణారెడ్డి, సర్పంచ్‌లు కావేరి, యాదగిరి, మంగమ్మ, నీరుడి గీత, వెంకటే్‌షగౌడ్, కొంతం వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు కందుల సరళకుమార్, జి.రవి, నీరుడి రామారావు, ఉపసర్పంచ్‌లు ఐలయ్య యాదవ్, రవికుమార్, నరేష్, రాజు, గీత, సత్యనారాయణగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పోచారం మునిసిపాలిటీ యంనంపేటలోని శ్రీ భూనీల వేంకటేశ్వర రంగనాథస్వామి ఆలయ ట్రస్టు బోర్డు నూతన కమిటీచే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన ట్రస్డు బోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్‌గా రాజే్‌షగౌడ్, డైరెక్టర్లుగా రవీందర్, నరేందర్, నిర్మల, చంద్రారెడ్డి, లక్ష్మన్‌నాయక్‌లు నియమితులయ్యారు. అనంతరం సూర్య యూత్ క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, పోచారం మునిసిపల్ చైర్మన్ కొండల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రెడ్యానాయక్, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఘట్‌కేసర్ మునిసిపల్ చైర్‌పర్సన్ పావనీ జంగయ్యయాదవ్, నాయకులు చామకూర భద్రారెడ్డి, మందాడి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.