కార్పొరేషన్ రుణాలను గ్రౌండింగ్ చేయాలి
ABN , First Publish Date - 2021-10-22T05:06:47+05:30 IST
కార్పొరేషన్ రుణాలను గ్రౌండింగ్ చేయాలి

మర్పల్లి: కార్పొరేషన్ రుణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం మండలాల బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలపట్ల బ్యాంకు మేనేజర్లు నిర్లక్ష్యం వహించకుండా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. డ్వాక్రా సంఘాలలో రుణాలు పొంది సక్రమంగా వాయిదాలు చెల్లించని వారిపట్ల శ్రద్ధ వహించి రుణాలు వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల బ్యాంకు మేనేజర్లు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.