కరోనా కట్టడికి సహకరించాలి
ABN , First Publish Date - 2021-05-21T03:44:53+05:30 IST
కరోనా కట్టడికి సహకరించాలి

- మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కొనసాగుతున్న ఫీవర్ సర్వే
- కొవిడ్ నియంత్రణపై సమరం
- బాధితులకు సహాయం
ఘట్‌కేసర్/ఘట్‌కేసర్ రూరల్: కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో నిర్వహించిన జ్వరసర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం నారపల్లిలోని పోలీసు చెక్‌పోస్టును పరిశీలించి పోలీసులను వివరాలు అడిగితెలుసుకున్నారు. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి పోలీసులకు అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ నానావత్ రెడ్డియా నాయక్, కమిషనర్ సురేష్, మేనేజర్ నర్సింహులు పాల్గొన్నారు. మండలంలోని అవుషాపూర్, అంకుశాపూర్, మాదారం, మర్రిపల్లిగూడ, ఎదులాబాద్, ఘనాపూర్, కొర్రెముల, కాచవానిసింగారం, ప్రతా్‌పసింగారం, కొర్రెముల గ్రామాల్లో మొదటివిడత జ్వరసర్వే పూర్తయింది. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ సిబ్బందితో ఇంటింటికీ తిరుగుతూ శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తూ, దగ్గు, జలుబు ఉన్నాయా అని అరా తీస్తున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాయనరేష్, కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిలుగూరి సాయిలు, ఆశావర్కర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
40 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన ఎమ్మెల్యే
పరిగి: కరోనా రోగులకు పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బాసటగా నిలిచారు. 40 ఆక్సిజన్ సిలిండర్లను ఎమ్మెల్యే తాండూరు జిల్లా అస్పత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా రోగులు ఆధైౖర్యపడోద్దని సూచించారు. కొవిడ్ బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయి చికిత్సలు అందిస్తుందన్నారు. ముందుగా గుర్తిస్తే నివారణ చాలా సులభమని పేర్కొన్నారు. పరిగి అస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తానని తెలిపారు.
ఫీవర్ సర్వేతో ఆరోగ్య సమస్యల గుర్తింపు
కులకచర్ల: ఫీవర్ సర్వేతో ఆరోగ్య విషయాలు వెల్లడవుతున్నాయనిముజాహిత్‌పూర్ సర్పంచ్ లక్ష్మి తెలిపారు. గురువారం గ్రామంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి ఫీవర్ సర్వే చేశారు. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు స్వరూప, పద్మపాల్గొన్నారు.
దాతలు చరిత్రలో నిలిచిపోతారు
లాక్‌డౌన్ సమయంలో సాయం అందించిన వారు చరిత్రలో నిలిచిపోతారని జడ్పీటీసీ రాందా్‌సనాయక్ తెలిపారు. విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి నిత్య భోజనం అందిస్తున్నారు. గురువారం పీఎ్‌సలో పోలీస్ సిబ్బందికి అన్నం ప్యాకెట్‌లు జడ్పీటీసీ అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఏఎ్‌సఐ కృష్ణ, రాంలాల్‌నాయక్, నర్సింహులు, వెంకటయ్యగౌడ్, హరికృష్ణ, కృష్ణయ్యగౌడ్ తదితులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా విజృంభణ
పరిగి: కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం చేతులేత్తేయడంతోనే వైరస్ విజృంభిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్ ఆరోపించారు. గురువారం ఆయన పరిగిలో విలేకరులతో మాట్లాడారు. కరోనామృతులు, పాజిటివ్ కేసుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకునే కిట్లు కూడా లేకపోవడం ప్రభుత్వ ఆసమర్థతను నిదర్శమన్నారు. ప్రతి నియోజకవరంలో 200 బెడ్ల స్థాయిలో కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.
ఇంటింటి సర్వే పరిశీలన
బషీరాబాద్: మండలంలోని జీవన్గి గ్రామంలో జ్వర సర్వేను బషీరాబాద్ ఎంపీడీవో రమేష్ గురువారం పరిశీలించారు. ఆశావర్కర్లను వివరాలు అడిగి తెలసుకున్నారు. అనంతరం ఆశలకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
అందరికీ టీకాలు ఇవ్వాలి
ఘట్‌కేసర్: కరోనా మహమ్మరి నుంచి ప్రజల ప్రాణలను కాపాడటానికి వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతిఒక్కరికీ టీకాలు వేయాలని సీపీఎం నాయకులు గురువారం ఘట్‌కేసర్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కోట్యానాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు చింతల యాదయ్య, సబిత, సునీతాదేవి పాల్గొన్నారు.
కరోనా టెస్టింగ్ కేంద్రం వద్ద చలువ పందిళ్ల ఏర్పాటు
కీసర: మండలంలోని కీసరలో గల రైతువేదిక వద్ద కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా వచ్చిన వారికి నీడలేకుండా పోయింది. దీంతో సమస్యను గుర్తించి కీసరకు చెందిన నల్లా వెంకట్‌రెడ్డి, బండారి శ్రీనివా్‌సరెడ్డిలు గురువారం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈమేరకు ఎంపీడీవో పద్మావతి, మండల వైద్యాధికారి సరిత పరిశీలించారు.
మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కృషి
ఘట్‌కేసర్/శామీర్‌పేట: మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నిర్మిస్తున్న మినీఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ నానావత్ రెడ్డియా నాయక్, కమిషనర్ సురేష్, మేనేజర్ నర్సింహులు, కౌన్సిలర్ రాజశేఖర్ పాల్గొన్నారు. శామీర్‌పేటలో టీఆర్‌ఎస్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు అబ్బగౌని మాధవి మజీద్‌పూర్ పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో శ్రీనివా్‌సగౌడ్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.