కరోనాను అరికట్టాలి
ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST
కరోనాను అరికట్టాలి

- ప్రజాప్రతినిధులు, నాయకులు
- సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
- కొనసాగుతున్న జ్వర సర్వే
ఘట్కేసర్ రూరల్ : ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాచవానిసింగారం సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి అధ్యక్షతన గురువారం పంచాయతీ అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి కొత్తవారు వస్తుండటంతో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో పాలకవర్గం సభ్యులు అప్రమత్తంగా ఉంటూ గ్రామంలో పాజిటివ్ వచ్చినవారికి కిట్లు అందుతున్నాయా? లేదా? అని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు నవీన్, మహేష్, సంఽధ్య, అరుణ, రజిత, సుదర్శన్, కార్యదర్శి మధుసుధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఘనాపూర్ మండలంలో గురువారం సర్పంచ్ బద్దం గోపాల్‌రెడ్డి అధ్యక్షతన పంచాయతీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహంచారు. గ్రామంలో అవసరమున్నచోట భూగర్భ మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిత్యం రసాయనాలను పిచికారీ చేయిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. దాతలు గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మధు, వార్డుసభ్యులు పరమేష్, భాస్కర్, హేమంత్‌గౌడ్, పద్మ, మయూరి, కాంతమ్మ, వర్థ్యా పవన్‌నాయక్, శ్వేత, కో-అప్షన్ సభ్యుడు సురే్‌షనాయక్, తదితరులున్నారు.
- కరోనా కట్టడికి సహకరించాలి
ఘట్కేసర్ : కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఘట్కేసర్ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం వార్డు పరిధిలోని పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కిరణ్కాంత్రెడ్డి, వినోద్‌రెడ్డి, గోపి, సందీ్‌పరెడ్డి, వీరన్న, శేఖర్, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
- కొనసాగుతున్న జ్వర సర్వే..
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపల్లో జ్వర సర్వే కొనసాగుతోంది. గురువారం మున్సిపల్ సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించారు. జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించి కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కాగా మేడ్చల్ మున్సిపల్లో నిర్వహిస్తున్న సర్వేపై కొంతమంది కౌన్సిలర్లు పెదవి విరుస్తున్నారు. పలు వార్డులో వైద్యసిబ్బంది నామమాత్రంగా వివరాలు బుక్‌లో రాసుకుని వెళ్లిపోతున్నారని, ఎటువంటి కిట్లు అందజేయడం లేదని విమర్శిస్తున్నారు. దీనిపై వైద్యాధికారులు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వడంలేదని వాపోతున్నారు. జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమైన కిట్లు అందజేస్తేనే సర్వే లక్ష్యం నెరవేరుతుందని కౌన్సిలర్లు తెలిపారు. ఇంటి నంబర్లు, ఇంటి సభ్యుల వివరాలు రాసుకుని వెళితే ఫలితం ఏం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని సర్వే పకడ్బందీగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.