ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర పోరాటం

ABN , First Publish Date - 2021-08-11T04:44:21+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర పోరాటం

ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర పోరాటం
కేశంపేట : సభ్యత్వం అందిస్తున్న గోవర్ధన్‌యాదవ్‌

కేశంపేట/చేవెళ్ల : ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ యూనియన్‌ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం కేశంపేట, అల్వాల, కేజీబీవీ, కొత్తపేట, ఎక్లా్‌సఖాన్‌పేట, సంగెం ప్రభుత్వ పాఠశాలల్లో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై తమ యూనియన్‌ 50ఏళ్లుగా పోరాటం  చేస్తోందని తెలిపారు. సంఘం నాయకులు శ్రీనివాససాగర్‌, బద్యానాయక్‌, నాగిరెడ్డి, కరుణాకర్‌, ప్రదీ్‌పకుమార్‌, ఇందిరమ్మ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ పని చేస్తుందని ఆ యూనియన్‌ చేవెళ్ల మండలశాఖ అధ్యక్షుడు వెంకటేశం అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్‌ మండల గౌరవాధ్యక్షుడు సత్తయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శి దయానంద్‌, కార్యవర్గ సభ్యులు వెంకట్‌రెడ్డి, నర్సింహరెడ్డి, రాజేందర్‌, వినోద్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

Updated Date - 2021-08-11T04:44:21+05:30 IST