కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం
ABN , First Publish Date - 2021-03-25T04:38:02+05:30 IST
కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం

- సీనియర్ నాయకులు వసంతం, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి
చేవెళ్ల/ఆమనగల్లు/చౌదరిగూడ: కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు వసంతం, డీసీసీ ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్యర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్యక్రమంలో మహేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు పాండుయాదవ్, కరుణాకర్‌రెడ్డి, మద్దెల శ్రీనివాస్, సత్యనారాయణ, తదితరులున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడిక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మండ్లీ రాములు, కృష్ణనాయక్, వస్పుల శ్రీశైలం, సురేశ్‌నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో చౌదరిగూడ మండలంలోని నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సత్యనారాయణరెడ్డి, ఎజాజ్, శివకుమార్, భాస్కర్, అజమ్, అన్వర్, అలీ, మహేష్ తదితరులున్నారు.