ఘనంగా కోటి రుద్రాభిషేకం
ABN , First Publish Date - 2021-11-06T05:29:28+05:30 IST
ఘనంగా కోటి రుద్రాభిషేకం

మొయునాబాద్ రూరల్: చిలుకూరు బాలాజీ ఆలయం శుక్రవారం శివ నామస్మరణతో మార్మోగింది. మండల పరిధిలోని చిలుకూరు దేవాలయం సమీపంలోని కోటి రుద్రాక్ష నగరిలో శ్రీనివాస కల్యాణం ట్రస్ట్ అధ్వర్యంలో సహస్ర స్పటిక లింగార్చన సహిత, మహారుద్ర మంత్రపూర్వక కోటి రుద్రాక్ష కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెయ్యి శుద్ధమైన స్పటిక లింగాలను అమర్చి లింగేశ్వరునికి 100 మంది వేదపండితుల ద్వారా 1331 సార్లు పంచామృతాలు, వివిధ మధుర ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.