బాల్య వివాహం నిలిపివేత

ABN , First Publish Date - 2021-08-28T04:57:41+05:30 IST

బాల్య వివాహం నిలిపివేత

బాల్య వివాహం నిలిపివేత

కులకచర్ల: చౌడాపూర్‌తో త్వరలో జరుగబోయే బాల్య వివాహాన్ని అధికారులు నిలిపివేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)కు సెప్టెంబరు 3న పెళ్లి జరిపించాలని కుటుంబసభ్యులు నిశ్చయించారు. బాలిక పెళ్లి విషయం 1098 చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం అందడంతో శుక్రవారం చైల్డ్‌లైన్‌, రెవెన్యూసిబ్బంది సర్పంచ్‌ కొత్త రంగారెడ్డి బాలిక కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడారు. బాలికకు యుక్త వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలతో హామీపత్రాన్ని రాయించారు. ఆర్‌ఐ లింగయ్య, మండల చైల్డ్‌లైన్‌ఇన్‌చార్జి రాంచంద్రయ్య, కల్పన పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:57:41+05:30 IST