అందరూ పాస్!
ABN , First Publish Date - 2021-05-22T05:05:51+05:30 IST
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

- పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
- రంగారెడ్డి జిల్లాలో 48,029, వికారాబాద్ జిల్లాలో 13,994, మేడ్చల్ జిల్లాలో 44,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్ /ఆంధ్రజ్యోతి, వికారాబాద్ / ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుద లయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా ఈ ఏడాది కూడా తెలం గాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించగా... ఈసారి జరిగిన ఒక ఫార్మేటివ్ (నిర్మాణాత్మక మూల్యాంకనం) అసెస్‌మెంట్ ఆధారంగా విద్యా ర్థులకు గ్రేడ్లు కేటాయించారు. అయితే ఈ ఏడాది పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షా ఫీజులు చెల్లించిన వారికి హాల్‌టికెట్ నెంబరు కేటాయించారు. కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేశారు. తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థలను ఓపెన్ చేశారు. 9,10 తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష పాఠాలు షురూ చేశారు. 51రోజులపాటు విద్యాసంస్థలు కొన సాగాయి. మార్చి మొదటివారం నుంచి కరోనా వైరస్ పంజా విసరడంతో... పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మార్చి 23 నుంచి మరోసారి తాత్కాలికంగా విద్యాసంస్థలన్నీ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించింది. టీశాట్, యాదగిరి, తదితర చానళ్ల ద్వారా పాఠాలను విద్యార్థులు ఇంటి నుంచే వీక్షించేలా ఏర్పాట్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. గతేడాది మాదిరిగా ఈసారి కూడా టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాసయ్యారు.
ఫీజు చెల్లించిన వారంతా పాస్..
రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లించిన 48,029 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల య్యారు. వీరిలో బాలురు 25,197 మంది ఉండగా, 22,832 మంది బాలికలు పరీక్షా ఫీజు చెల్లించారు. వీరంతా పాసయ్యారు.
41.89 శాతం జీపీఏ
జిల్లాలో పదోతరగతి ఫలితాల్లో 20,119 మంది విద్యార్థులు జీపీఏ 10 సాధించారు. వీరి శాతం 41.89గా నమోదైంది. జీపీఏ 10 సాధించిన వారిలో బాలురు 9,034మంది, బాలికలు 11,085మంది ఉన్నారు. బీసీడబ్ల్యుఆర్‌ఎస్‌లో అత్యధికంగా 93.55 శాతం జీపీఏ నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలో 3,690 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. జిల్లాలో 13,994 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించారు. దీంతో వీరంతా ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 301 ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 231 ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ, మోడల్, గురుకుల పాఠశాలలు, 70 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఉత్తీర్ణత సాధించిన వారిలో 7,067 మంది బాలురు, 6,927 మంది ఉండగా, వీరిలో 3690 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. 10 జీపీఏ సాధించిన వారిలో 1240 మంది జడ్సీహెచ్‌ఎస్ విద్యార్థులు ఉండగా, 76 మంది ఎయిడెడ్, 374 మంది ఎంజేపీటీబీసీడబ్ల్యు గురుకులాలు, 114 మంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 40 మంది ఎస్‌టీ బాలికల ఆశ్రమ, 119 మంది కేజీబీవీ, 103 మంది తెలంగాణ మినీ గురుకులాలు, 216 మంది తెలంగాణ మోడల్ స్కూల్, 99 మంది టీఎస్ గురుకుల పాఠశాల, 141 మంది టీఎస్‌ఎస్‌డబ్ల్యుఆర్, 36 మంది టీఎస్‌టీడబ్ల్యు గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.
మేడ్చల్ జిల్లాలో..
పదో తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 99.99శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం 879 పాఠశాలల్లో 44,185 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 44,181మంది ఉత్తీర్ణులు కాగా, నలుగురు ఇతర కారణాలతో ఉత్తీర్ణులు కాలేదు. మొత్తం 23,259 మంది బాలురకు గాను 23,257 మంది ఉత్తీ ర్ణులయ్యారు. బాలికలు 20,926 మందికి గానూ.. 20,924మంది ఉత్తీర్ణుల య్యారు. జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలు, మహాత్మజ్యోతిరాబు పూలే గురుకులాలు, తెలంగాణ మైనార్టీ గురుకులాలు, టీఎస్ రెసిడెన్షియల్స్, టీఎస్ సోషల్‌వేల్ఫేర్, తెలంగాణ గిరిజన గురుకులాలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు 99.26శాతం ఉత్తీర్ణులయ్యారు.
రంగారెడ్డి జిల్లాలో టెన్త్ ఫలితాల వివరాలు
మేనేజ్‌మెంట్ పాసైన వారు 10శాతం జీపీఏ శాతం
జడ్పీ 13,299 2,369 17.81
బీసీడబ్ల్యుఆర్‌ఎస్ 527 493 93.55
జీవోవీటీ 380 59 15.53
కేజీబీవీ 681 165 24.23
ప్రైవేట్-అన్‌ఎయిడెడ్ 30,349 16,093 53.03
టీఎంఆర్‌ఈఐఎస్ 506 253 50.00
టీఎస్‌ఎంఎస్ 973 303 31.14
టీఎస్‌ఆర్‌ఎస్ 45 17 37.78
టీఎస్‌ఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్ 310 75 24.19
టీఎస్‌డబ్ల్యుఆర్ 813 246 30.26
టీటీడబ్ల్యుఆర్‌ఈఐఎస్ 39 12 30.77
టీటీడబ్ల్యుఆర్‌ఎస్ 107 34 31.78
మొత్తం 48,029 20,119 41.78