మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-12-31T04:07:04+05:30 IST

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
రైతులను చెదర గొడుతున్న పోలీసులు

పూడూరు: మీర్జాపూర్‌లో ఎస్‌ఆర్‌మినరల్స్‌ మైనింగ్‌కు కేటాయించిన భూమిపై గురువారం మైనింగ్‌ ఏడీ సాంబశివుడు, జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. కాగా ఆ గ్రామపరిధిలోని సర్వే నెం.41లో మొత్తం 166 ఎకరాల భూమి ఉంది. అందులో 26 ఎకరాలు మైనింగ్‌కు కేటాయించారు. మిగతా భూమిని అసైన్డ్‌ కింద రైతులకు ఇచ్చారు. ఈ భూములకు చెందిన పది మంది రైతులు సర్వే నెంబర్లు కలిగి ఉన్నా  ఇప్పటి వరకు హద్దులను చూపలేదు. దీంతో  తమకు కేటాయించిన భూములకు చెందిన హద్దులను చూపిన తర్వాతే మిగతా భూమిని మైనింగ్‌కు కేటాయించాలని, రైతులు తమ అభిప్రాయాలను అధికారులకు విన్నవించారు.   ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఎన్‌జీవోలకు మైనింగ్‌ సిబ్బంది డబ్బులు అందజేస్తున్న క్రమంలో కొందరూడబ్బులు పంచుతున్నారని ఆందోళన చేశారు. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ వెంకటరామయ్య, ఎస్సై శ్రీశైలం పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T04:07:04+05:30 IST