తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్‌ జయశంకర్‌

ABN , First Publish Date - 2021-06-22T04:12:24+05:30 IST

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్‌ జయశంకర్‌

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్‌ జయశంకర్‌
షాద్‌నగర్‌ : జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఉద్యమకారులు

  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ 
  • జయశంకర్‌ వర్ధంతి.. విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళి

షాద్‌నగర్‌/కేశంపేట/నందిగామ/కొత్తూర్‌: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. జయశంకర్‌ 10వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌,  జడ్పీటీసీ వెంకట్‌రామ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, ఎంపీపీ ఇద్రీస్‌ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారులు శనివారం జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలుర్పించారు.  సందిగామ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యలయంలో సర్పంచ్‌ జిల్లెల్ల వెంకట్‌రెడ్డ్డి ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, గోవిందునాయక్‌, నెహ్రుబాబు, శంకరయ్య, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. కేశంపేట మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, కొత్తపేట సర్పంచ్‌ నవీన్‌ కుమార్‌, మాజీ సర్పంచ్‌ అంజయ్య, శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల యువత అధ్యక్షుడు మురళీ మోహన్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తూర్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద జయశంకర్‌ చిత్రపటానికి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శోభలింగంనాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డోలీ రవీందర్‌, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:12:24+05:30 IST