తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-14T05:43:31+05:30 IST

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ
నవాబుపేట: పూలపల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ప్రజాప్రతినిధులు

నవాబుపేట/పరిగి: దశాబ్దాలుగా తెలంగాణ ఖ్యాతి కి, సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పం డుగ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం పూలపల్లి, గొల్లగూడ, లింగంపల్లి గ్రామాల్లో బతుక మ్మ చీరలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీ బతుకమ్మ పండుగకు ఆడ బిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. బతుకమ్మ చీరల తయారీతో చేనేత కార్మికులకు ఉపాధికి కల్పిస్తున్నారన్నారు. బతుకమ్మ, దసరా పండుగలు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకా ంక్షించారు. అనంతరం పులిమామిడిలో చెత్త బుట్టల పంపిణీ చేశారు. ఇదే గ్రామంలో చికెన్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, విమలరంగారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, పర్మయ్య పీఏసీఎ స్‌ డైరెక్టర్‌ విఠల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ కృష్ణాగౌడ్‌ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ అన్నారు. ఆరో వార్డులో చీరలు పంపిణీ చేశారు. పండుగలన్నింటికీ కేసీఆర్‌ దుస్తులు పంపిణీ చేస్తున్నారన్నారు. కౌన్సిలర్‌ నాగేశ్‌, కమిషనర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T05:43:31+05:30 IST