రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
ABN , First Publish Date - 2021-10-21T05:13:48+05:30 IST
రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్‌ఫోర్స్

తాండూరు: తాండూరులోని మల్లప్పమడిగె సమీపం బియ్యం దుకాణంలో 43క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ బృందం రేషన్‌దు కాణాన్ని తనిఖీ చేసి, బియ్యాన్ని సీజ్ చేసింది. 23క్వింటాళ్లు రేషన్ బియ్యంగా గుర్తించామని, మిగతా బియ్యంపై విచారిస్తు న్నామని సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. దుకాణ యజమాని విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు.
- నకిలీ పెస్టిసైడ్స్ పట్టివేత
పాత తాండూరులో జీఎస్టీ లేకుండా నకిలీ క్రిమి సం హారక మందులను వివిధ షాపులకు విక్రయిస్తుండగా బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. పాత తాండూరుకు చెందిన అహ్మద్‌ఖాన్, మునీ ర్ రూ.1లక్ష విలువ చేసే పెస్టిసైడ్స్ అక్రమంగా నిల్వ చేయగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. వారు విక్రయించామని చెబుతు న్న షాపుల్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు.