యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
ABN , First Publish Date - 2021-10-22T05:25:48+05:30 IST
యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
కీసర రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు కాపాడిన ఘటన బుధవారం అర్ధరాత్రి కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండ లంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన శ్యామ్ తన మిత్రుడు విష్ణు ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో కాల్ చేసినట్లు బుధవారం రాత్రి 11.45గంటలకు డయల్-100కు సమాచారం ఇచ్చారు. దీంతో డయల్-100 సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని కీసర పోలీసులకు చేరవేశారు. కీసర పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది తిమ్మాయిపల్లికి చేరుకుని శ్యామ్‌ను సంప్రదించి విష్ణు మొబైల్ నంబర్‌ను సేకరించారు. ఆ నంబర్‌ను ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్‌కు తెలియజేయగా విష్ణు ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. గ్రామస్థులు, పోలీసులు వెళ్లేసరికి నిర్మానుష్య ప్రదేశంలో ఓ చెట్టుకు విష్ణు తాడు బిగించి, ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులను స్థానికులు అభినందించారు.