సినీ అశ్లీల పోస్టర్లపై విద్యార్థుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-24T04:51:17+05:30 IST

సినీ అశ్లీల పోస్టర్లపై విద్యార్థుల ఆగ్రహం

సినీ అశ్లీల పోస్టర్లపై విద్యార్థుల ఆగ్రహం
సినీ అశ్లీల పోస్టర్లను చించివేస్తున్న విద్యార్థులు

  • అశ్లీల సినిమాలను నిషేదించాలని డిమాండ్‌ 


షాద్‌నగర్‌అర్బన్‌: పట్టణంలో రోడ్ల పక్కన గోడలపై అతికించిన సినీ అశ్లీల పోస్టర్లపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చించివేశారు. షాద్‌నగర్‌ ప్రభుత్వ డ్రిగీ కళాశాలలోని ఎన్‌ఎ్‌సఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్లీల సినిమాలను, పోస్టర్లను నిషేదించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో అశ్లీల సినీ పోస్టర్లు కనిపించినా... అశ్లీల సినీమాలను ప్రదర్శించినా సహించేది లేదని విద్యార్థులు హెచ్చరించారు. 

Updated Date - 2021-11-24T04:51:17+05:30 IST