భగవద్గీత శ్లోక కంఠస్త పోటీలో విద్యార్థి ప్రతిభ

ABN , First Publish Date - 2021-12-27T05:00:11+05:30 IST

భగవద్గీత శ్లోక కంఠస్త పోటీలో విద్యార్థి ప్రతిభ

భగవద్గీత శ్లోక కంఠస్త పోటీలో విద్యార్థి ప్రతిభ
సచ్చిదానంద స్వామి చేతులమీదుగా గోల్డ్‌మెడల్‌, ప్రశంసాపత్రం అందుకుంటున్న మోక్ష

బషీరాబాద్‌ : కర్ణాటకలోని మైసూర్‌ దత్తపీఠం వారు నిర్వహించిన భగవద్గీత కంఠస్త పోటీలలో వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతన్‌గౌడ్‌ గ్రామానికి చెందిన టి. మహేందర్‌ కూతురు మోక్ష(10) బంగారు పథకం సాధించింది. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు మైసూర్‌లోని దత్తపీఠంలో భగవద్గీత కంఠస్త పోటీలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో 700 శ్లోకాలకు కంఠస్త పోటీలు అరగంట పాటు నిర్వహించగా మోక్ష ప్రతిభ కనబర్చింది. ఫైనల్‌ పోటీలో గెలుపొందిన మోక్ష గణపతి సచ్చిదానందస్వామి చేతులమీదుగా గోల్డ్‌మెడల్‌, ప్రశంసాపత్రం అందుకుంది. బాలికకు మంతన్‌గౌడ్‌ గ్రామస్తులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-12-27T05:00:11+05:30 IST