అదనపు బస్సు కోసం విద్యార్థుల ధర్నా

ABN , First Publish Date - 2021-12-08T05:47:16+05:30 IST

అదనపు బస్సు కోసం విద్యార్థుల ధర్నా

అదనపు బస్సు కోసం విద్యార్థుల ధర్నా
ధర్నా చేస్తున్న విద్యార్థులు

షాద్‌నగర్‌రూరల్‌: ఫరూఖ్‌నగర్‌ మండలం కొండన్నగూడ గ్రామానికి అదనపు బస్సు నడపాలని మంగళవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. షాద్‌నగర్‌ డిపో వద్దకు చేరుకొని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు. ఉదయం, సాయంత్రం ఒక్కసారి మాత్రమే బస్సు రావడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-08T05:47:16+05:30 IST