రాష్ట్రాభివృద్ధే ధ్యేయం
ABN , First Publish Date - 2021-12-10T04:52:33+05:30 IST
రాష్ట్రాభివృద్ధే ధ్యేయం

- మంత్రి మల్లారెడ్డి
ఘట్‌కేసర్: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.1.17కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందుందన్నారు. మున్సిపాలిటీల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్ల పనులు చేపట్టామని తెలిపారు.
- 64మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 64మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం బాలాజీనగర్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇటీవల మృతిచెందిన పంచాయతీ మాజీ సభ్యుడు సారా కాళిదాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమారుడు శ్రీనివా్‌సగౌడ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పితృవియోగం పొందిన ఘట్‌కేసర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ ఎం.శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పోచారం మున్సిపల్ వైస్‌చైర్మన్ రెడ్యానాయక్, ఘట్‌కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పి.మాధవరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.