ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల కోసం ప్రత్యేక చట్టం

ABN , First Publish Date - 2021-06-23T04:31:54+05:30 IST

ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం

ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల కోసం ప్రత్యేక చట్టం
వ్యాక్సినేషన్‌ వేయించుకుంటున్న ట్రాన్స్‌జెండర్‌

  • జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథా రిటీ సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఉదయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సరూర్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రత్యేక కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన ఈ వ్యాక్సినేషన్‌లో 60మంది ట్రాన్స్‌జెండర్స్‌ టీకా వేయించుకున్నారు. వారందరికీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్స్‌ హక్కులు కూడా మానవ హక్కులని, ఆలస్యంగానైనా వారి హక్కుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వారి కోసం సర్టిఫికెట్స్‌, ఐడీకార్డ్స్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దీన్‌దయాల్‌, తహసీల్దారు రామ్మోహన్‌, సీడీపీవో వినితాదేవి, నోడల్‌ అధికారి రమేష్‌, ట్రాన్స్‌జెండర్‌ ఆక్టివిస్ట్‌లు ముకుంద మాల, రచన, హయత్‌నగర్‌, జిల్లా కోఆర్డినేటర్‌ విజయలక్ష్మి, హన్మంతు, ఎంఎస్‌కే టీంసభ్యులు పాల్గొన్నారు. Updated Date - 2021-06-23T04:31:54+05:30 IST