పరిగి పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు

ABN , First Publish Date - 2021-12-31T05:19:42+05:30 IST

పరిగి పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు

పరిగి పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు
మురికికాలువ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి/దోమ : పరిగి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకవస్తానని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మునిసిపల్‌ పరిధిలోని 5వవార్డులో మురికికాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివార్డుల్లో సమ ప్రాధాన్యతతో పనులు చేపడుతున్నామని తెలిపారు. మునిసిపల్‌ పరిధిలోని ప్రస్తుతం రూ.15 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయని, శాశ్వత మురికికాలువల నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోనే పరిగిని ఆదర్శ పట్టణంగా మారుస్తామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, వైఎస్‌చైర్మన్‌ ప్రసన్న, ఎంపీపీ అరవింద్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆర్‌. ఆంజనేయులు, నాయకులు బి.ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  అలాగే ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. దోమ మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ మల్లేశం, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, కో-ఆప్షన్‌ ఖాజాపాషా, డీటీ రాజేందర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:19:42+05:30 IST