ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2021-10-22T05:21:59+05:30 IST

ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): జిల్లాలో ధరణి దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నట్లు మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 1995 నుంచి 2007 వరకు భూముల పట్టాదారుల మార్పులను ధరణి పోర్టల్‌ అనుమతించడం లేదని, దీంతో చాల మంది ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు ధరణి ఫార్మాట్‌లో దరఖాస్తులు చేసుకోవడం తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ విభాగాల్లో పది వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో 90 శాతంపైగా వాటిని  పరిష్కరించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 126 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలోఽ ధరణి సమస్యలను పరిష్కరించి రైతులందరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని తెలిపారు. 

Updated Date - 2021-10-22T05:21:59+05:30 IST