తండ్రి బైక్‌ కొనివ్వలేదని కుమారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-29T05:08:40+05:30 IST

తండ్రి బైక్‌ కొనివ్వలేదని కుమారుడి ఆత్మహత్య

తండ్రి బైక్‌ కొనివ్వలేదని కుమారుడి ఆత్మహత్య

పూడూర్‌: కండ్లపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌(25) కొన్ని రోజులుగా తనకు బైక్‌ కొనివ్వాలని తండ్రిని అడుగుతున్నాడు. కానీ, అడిగిన ప్రతిసారి తన దగ్గర డబ్బులు లేవని తండ్రి మందలించాడు. ఈ క్రమంలో ఈ నెల 25న ఇంటి నుంచి బయటికి వెళ్లిన రాజశేఖర్‌ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి తన స్నేహితుడు వినయ్‌కు ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. వెంటనే స్నేహితుడు తండ్రి రాంచంద్రయ్యకు సమాచారమందించాడు. ఇద్దరూ కలిసి రాజశేఖర్‌ను చికిత్స నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ రాజశేఖర్‌ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.

Updated Date - 2021-12-29T05:08:40+05:30 IST