డాక్టర్ల అనుమతితోనే మత్తుమందులు విక్రయించాలి
ABN , First Publish Date - 2021-10-29T05:21:03+05:30 IST
డాక్టర్ల అనుమతితోనే మత్తుమందులు విక్రయించాలి

షాద్‌నగర్ రూరల్: క్వాలిఫైడ్ డాక్టర్ల అనుమతితో నే మత్తు కలిగించే మందులు విక్రయించలని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో గురువారం మెడికల్ షాపుల యజమానులు, డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. యువకులు మత్తుకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్ దొరక్కపోవడంతో మత్తు కోసం మెడికల్ షాపుల్లో డైజోఫామ్, అల్ఫాజోలం, దగ్గు మందుల కు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. మత్తు మందు క్వాలిఫైౖడ్ డాక్టర్ల ప్రిస్ర్కిషన్ ఉంటేనే ఇవ్వాలని సూచించారు. మత్తు కలిగించే మందులు ఇస్తే కచ్చితంగా రిజిష్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన యువత మత్తుకు అలవాటు పడి మత్తు కలిగించే మందులను మెడికల్ షాపుల్లో కొంటున్నారని తెలిపారు. సమావేశంలో డీఐలు అంజుమ్ అబిదా, రాజు, శైలజారాణి, ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరభద్రప్ప, యశ్వంత్‌గౌడ్ పాల్గొన్నారు.