కమ్ముకున్న మంచు.. వాహనదారుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-10-20T04:35:04+05:30 IST

కమ్ముకున్న మంచు.. వాహనదారుల ఇబ్బందులు

కమ్ముకున్న మంచు.. వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఉదయం 8గంటలకు కనిపించిన సూర్యుడు

మొయినాబాద్‌ రూరల్‌ : మంచు తీవ్రత ఇప్పటి నుంచే మొదలయ్యింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌, అజీజ్‌నగర్‌, ఆమ్డాపూర్‌, నాగిరెడ్డిగూడ, చందానగర్‌, మోత్కుపల్లి, చిన్నమంగళారం, ఎన్కేపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 6 నుంచి 8గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకోవడంతో సూర్యుడు కనిపించలేదు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై తీవ్రంగా మంచుపడడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. కాగా, పంట పొలాలపై మంచు ఆకర్షణీయంగా కన్పించింది.

Updated Date - 2021-10-20T04:35:04+05:30 IST