కరోనాతో ఉమ్మడి జిల్లాలో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:33:56+05:30 IST

కరోనాతో ఉమ్మడి జిల్లాలో ఆరుగురి మృతి

కరోనాతో ఉమ్మడి జిల్లాలో ఆరుగురి మృతి

వికారాబాద్‌/ధారూరు/కులకచర్ల/మాడ్గుల/పరిగి/కొడంగల్‌/ : కరోనాతో ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలో గడ్డమీది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(46) క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంటుండగా కరోనా సోకడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు. అలాగే కేరెల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు(75) హోం క్వారంటైన్‌లో ఉంటూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఎబ్బనూరు గ్రామంలో ఓ వృద్ధుడు కరోనాతో మరణించగా సర్పంచ్‌, తాండూర్‌కు చెందిన మహాసేవ యూత్‌ వెల్ఫేర్‌ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కులకచర్ల మండలం సాల్వీడ్‌ గ్రామంలో ఓ వృద్ధుడు(65) మృతిచెందారు. కాగా రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రానికి చెందిన ఇద్దరు కరోనాతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

  • జిల్లాలో 276 కరోనా కేసులు 

వికారాబాద్‌ జిల్లాలో ఆదివారం 987 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 276 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాండూరులో 231 మందికి పరీక్షలు నిర్వహించగా 50 మందికి కొవిడ్‌ వచ్చింది. జిన్‌గుర్తిలో 15 మందికి పరీక్షలు చేయగా, ఇద్దరికి, బషీరాబాద్‌లో 51 మందికి పరీక్షలు నిర్వహించగా 10మందికి, నవాల్గలో 48 మందికి పరీక్షలు చేయగా 14 మందికి కొవిడ్‌ సోకినట్లు గుర్తించారు. పరిగిలో 71 మందికి పరీక్షలు చేస్తే 19మందికి, దోమలో 40 మందికి పరీక్షలు చేయగా, 24 మందికి, కులకచర్లలో 104 మందికి పరీక్ష లు నిర్వహించగా, 46 మందికి, పూడూరులో 74 మందికి పరీక్షలు చేయగా, వారిలో 24మందికి కొవిడ్‌ సోకింది. కొడంగల్‌లో 45 మందికి పరీక్షలు చేయగా, 22మందికి పాజిటివ్‌, దౌల్తాబాద్‌లో 34మందిలో 14మందికి, బొంరా్‌సపేట్‌లో 40 మందిలో 12మందికి కొవిడ్‌ వచ్చింది. రామయ్యగూడలో 37మందిలో 13మందికి, మోమిన్‌పేట్‌లో 40మందిలో ఆరుగురికి, పట్లూర్‌లో 29మందిలో 10మందికి, బంట్వారంలో 18మందిలో ఐదుగురికి, నవాబుపేట్‌లో 17మందిలో ఒకరికి, నాగసమందర్‌లో 22మందిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. కాగా సిద్దులూరులో 10 మంది, ధారూరులో 14 మంది, కోట్‌పల్లిలో 14, యాలాల్‌లో 11మందికి పరీక్షలు చేయగా, అందరికీ నెగిటివ్‌ వచ్చింది. మర్పల్లి, పెద్దేముల్‌, వికారాబాద్‌ల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయలేదు. కాగా కులకచర్ల మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో ఒకేరోజు 23 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇదిలావుండగా రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కేసుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Updated Date - 2021-05-17T05:33:56+05:30 IST