ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా శుక్లకుమార్‌

ABN , First Publish Date - 2021-11-01T05:06:32+05:30 IST

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా శుక్లకుమార్‌

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా శుక్లకుమార్‌
నియామకపత్రం అందుకుంటున్న శుక్లకుమార్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రంగారెడ్డి జిల్లా(ట్రెసా) జిల్లా కమిటినీ ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాయంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి. శుక్లకుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా అబ్ధుల్‌ రహమాన్‌ఖాన్‌, కె.అమరలింగంగౌడ్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మహ్మద్‌ నయీమోద్దీన్‌, యు.అశోక్‌కుమార్‌, ఎస్‌. జ్యోతి, కె.జంగయ్యలను ఎన్నికయ్యారు. జనరల్‌ సెక్రటరీగా ఎస్‌.జనార్ధన్‌రావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా సి.భాస్కర్‌, బి.సంగ్రామ్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా ఎం.మహేందర్‌రెడ్డి, అవినా్‌షకుమార్‌రాయ్‌, టి.సుచరిత, ఎం జయశ్రీలు ఎన్నికయ్యారు. కోషాధికారిగా వై.అనితారెడ్డి, స్ట్పోర్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా వై.రామక్రిష్ణ, కార్యవర్గ సభ్యులుగా టి.విజయకుమార్‌, మహబూబ్‌ఖాన్‌, వై.చంద్రారెడ్డి, వై.విక్రమ్‌రెడ్డి, టి.ఇంద్రసేనారెడ్డి, కేఎల్‌ఎన్‌.ఆదిత్యరాజు, ఎం.భాస్కర్‌ ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారి మన్నె ప్రభాకర్‌ నియామక పత్రాలను అందజేశారు.

Updated Date - 2021-11-01T05:06:32+05:30 IST