బీసీ కమిషన్‌ సభ్యుడిగా శుభప్రద్‌ పటేల్‌

ABN , First Publish Date - 2021-08-24T04:15:30+05:30 IST

బీసీ కమిషన్‌ సభ్యుడిగా శుభప్రద్‌ పటేల్‌

బీసీ కమిషన్‌ సభ్యుడిగా శుభప్రద్‌ పటేల్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం   
  • ఉద్యమకారుడికి ఎట్టకేలకు న్యాయం 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా  ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నూలి శుభప్రద్‌ పటేల్‌ను రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌ పట్టణానికి చెందిన శుభప్రద్‌ పటేల్‌ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు తీసుకోగా, కార్మిక, రాజ్యాంగ చట్టాల్లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఒకవైపు టీఆర్‌ఎ్‌సలో కీలక పాత్ర పోషిస్తూనే మరోవైపు న్యాయవాదిగా వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అఽధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడత జరిగిన నామినేటెడ్‌ పదవుల పందేరంలోనే శుభప్రద్‌పటేల్‌కు అవకాశం లభిస్తుందని జిల్లా ప్రజలు, నాయకులు భావించారు. వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , ఇతర ముఖ్యనేతలను కలిసినప్పుడు తప్పకుండా నామినేటెడ్‌ పదవి వస్తుందని భరోసా ఇస్తూవచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏడేళ్లకు ఎట్టకేలకు శుభప్రద్‌ పటేల్‌ కలసాకారమై నామినేటెడ్‌ పదవి వరించింది. వీరశైవ లింగాయత్‌ వర్గానికి చెందిన శుభప్రద్‌ పటేల్‌ను రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులుగా నియమిస్తూ సోమవారం సీఎ్‌ససోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శుభప్రద్‌ను టీఎ్‌సపీఎస్సీ మాజీ సభ్యులు విఠల్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులనందకుమార్‌, వీడీడీఎఫ్‌ వ్యవస్థాపక సభ్యులు కె.శ్రీనివాస్‌, రామారావు జోషి, నర్సిములు, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మెన్‌ అప్ప విజయకుమార్‌ అభినందించారు.

Updated Date - 2021-08-24T04:15:30+05:30 IST