కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఏనుగు శ్రావణి

ABN , First Publish Date - 2021-10-26T04:21:56+05:30 IST

కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఏనుగు శ్రావణి

కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఏనుగు శ్రావణి
శ్రావ ణికి నియామకపత్రం అందజేస్తున్న చల్లా నర్సింహారెడ్డి

కందుకూరు: దెబ్బడగూడ సర్పంచ్‌ ఏనుగు శ్రావణిని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కళ్లెం సుజాతరెడ్డి ప్రకటించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో వారు నియామకపత్రాన్ని అందజేసి మాట్లాడారు. పార్టీ అభ్యున్నతికి, ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఏనుగు శ్రావణికి జిల్లా బాధ్యతులు అప్పగించినట్టు తెలిపారు. శ్రావణి మాట్లాడుతూ తనకు జిల్లా పార్టీ బాధ్యతులు అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ణతలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణానాయక్‌, వైస్‌ఎంపీపీ గంగుల, శమంత, యూత్‌ కాంగ్రెస్‌ శ్రీధర్‌, రాణాప్రతా్‌పరెడ్డి, అప్జల్‌ బేగ్‌, అజీజ్‌ఖాన్‌, కె.వెంకటేశ్‌, పాండురంగారెడ్డి, ప్రశాంతి, కె.మధన్‌పాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:21:56+05:30 IST