భారత్‌ పౌరుషాన్ని చూపించారు

ABN , First Publish Date - 2021-10-30T04:43:53+05:30 IST

భారత్‌ పౌరుషాన్ని చూపించారు

భారత్‌ పౌరుషాన్ని చూపించారు
వికారాబాద్‌: పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఎస్పీ నారాయణ

  • వికారాబాద్‌ ఎస్పీ నారాయణ


వికారాబాద్‌/మోమిన్‌పేట: మంచుపర్వతాల మధ్య ఉన్న హాట్‌ స్ర్పింగ్స్‌ ప్రాంతంలో శత్రుదేశానికి భారతసైన్యం దేశ పౌరుషాన్ని చూపించిందని వికారాబాద్‌ ఎస్పీ నారాయణ అన్నారు. పోలీసుల అమరువీరుల దినోత్సవంలో భాగంగా శుక్రవారం వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959 అక్టోబర్‌ 21న డీఎస్పీ కరమ్‌ సింగ్‌ నేతృత్వంలో 21మంది బీఎస్‌ఎఫ్‌ బృందం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా చైనాసైనికులు కాల్పులు జరపగా వారికి భారత సైన్యం భారతదేశ పౌరుషం రుచి చూపించిందని గుర్తుచేశారు. పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ రషీద్‌, పరిగి డీఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ భారత్‌కుమార్‌, ఆర్‌ఐ రత్నం పాల్గొన్నారు. అదేవిధంగా మోమిన్‌పేట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 21న నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన కల్యాణి అనే విద్యార్థిని ప్రథమ బహుమతి సాధించగా ఎస్పీ నారాయణ ఆమెకు బహుమతిని అందజేశారు. 

Updated Date - 2021-10-30T04:43:53+05:30 IST