ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-11-10T05:16:12+05:30 IST

ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
నూతన కలెక్టరేట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్నకలెక్టర్‌ నిఖిల, ఎమ్మెల్యే ఆనంద్‌

  • సమీకృత కలెక్టరేట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ : అన్ని హంగులతో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధ్దం చేయాలి కలెక్టర్‌ నిఖిల సంబంధిత ఆర్‌అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే  ఆనంద్‌తో కలిసి నూతన  కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయని, చిన్నాచితకా పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఏసీలు, లిఫ్ట్‌లు సరిగా పనిచేస్తున్నాయో లేదో మరోసారి పరిశీలించుకోవాలని తెలిపారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ నిర్మాణపు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈకార ్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ లాల్‌సింగ్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, ఏఈలు లక్ష్మీనారాయణ, రాయుడు,  ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T05:16:12+05:30 IST