గొర్రెల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-20T05:40:47+05:30 IST

గొర్రెల దొంగ అరెస్టు

గొర్రెల దొంగ అరెస్టు
గొర్రెలను, సోమశివశంకర్‌ను అదుపులోకి తీసుకుంటున్న క్రైం ఎస్సై జగన్‌రెడ్డి

కీసర రూరల్‌: గొర్రెలను అపహరించిన దొంగను అదుపులోకి తీసుకున్నట్టు గురువారం ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన పిడుగు సాయప్ప తన గొర్రెలను నాగారం మున్సిపాలిటీ నేతాజీనగర్‌ పరిసరాల్లో మేపాడు. బుధవారం మధ్యాహ్నం వర్షం రావటంతో సమీప గోడ చాటుకు వెళ్లాడు. వర్షం తగ్గాక చూడగా మందలో 25గొర్రెలు తక్కువగా ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగారం నుంచి రాంపల్లి వరకు గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రాంపల్లి డీసీ కాలనీ సిల్వర్‌ బంగ్లా వద్ద, చెంగిచెర్లకు తరలిం చేందుకు 25 గొర్రెలతో ఉన్న సోమశివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 25 గొర్రెలను, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-20T05:40:47+05:30 IST