షర్మిల పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-15T04:34:21+05:30 IST

ఈనెల 20 నుంచి తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ

షర్మిల పాదయాత్ర
సమావేశంలో మాట్లాడుతున్న రాఘవరెడ్డి

  • ఈ నెల 20 నుంచి చేవెళ్ల నుంచి ప్రారంభం
  • వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి 


చేవెళ్ల : ఈనెల 20 నుంచి తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టను న్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి షర్మిలను ఆశీర్వదించి పాదయాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అప్పులపాలు చేసి ప్రతినెలా వడ్డీలు కడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బంగారు తెలంగాణ అంటూ.. బార్ల తెలంగాణగా మారుస్తున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమని సాధించుకున్న తెలంగాణలో నీళ్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు రాక యువత, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. సీఎం కేసీఆర్‌ను నిలదీసేందుకే షర్మిల 14నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు నిశ్చయించారని స్పష్టం చేశారు. ఈ నెల 20న చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కె. డేవిడ్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ప్రమీల, రవీందర్‌రెడ్డి, జిల్లాస్టీరింగ్‌ కమిటీ సభ్యురాలు నాగమణి, పార్టీ చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌, శంకర్‌పల్లి మండలాల కన్వీనర్లు శివారెడ్డి, యాదగిరి, మన్‌మోహన్‌, కరుణాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 


ఈనెల 16న జెండా కార్యక్రమం

ఈనెల 16న చేవెళ్ల, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లోని 30గ్రామాల్లో వైఎ్‌సఆర్‌టీపీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కొండ రాఘవరెడ్డి తెలిపారు. రాజేంద్ర నగర్‌లోని ఆరె మైసమ్మ దేవాలయం వద్ద ఉదయం 9గంటలకు జెండాపండుగ కార్యక్రమం ప్రారంభమవుతుందని, పాదయాత్రను విజయవంతం చేసేందుకు గాను నాలుగురోజుల ముందు జెండా పండుగ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.



Updated Date - 2021-10-15T04:34:21+05:30 IST