సేవాలాల్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-02-07T05:08:21+05:30 IST
సేవాలాల్ ఆశయ సాధనకు కృషి చేయాలి

- ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
ఆమనగల్లు : గిరిజనుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఈనెల 15న నిర్వహించే సేవాలాల్ జయంతి వేడుకలకు సంబంధించి కరపత్రాలను శనివారం నగరంలోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం వేడుకల్లో పాల్గొనాలని వెల్దండ మండల నాయకులు ఎమ్మెల్సీకి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లయ్య పదవీ విరమణ సన్మాన సభలో నారాయణరెడ్డి పాల్గొని సత్కరించారు. ఎంఈవో సర్థార్‌నాయక్ పాల్గొన్నారు.
మంత్రి సత్యవతిరాథోడ్‌కు ఘనస్వాగతం
గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఘన స్వాగతం పలికారు. కల్వకుర్తి పట్టణంలోని గురుకుల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న మంత్రిని వారు ఆమనగల్లు సమీపంలో స్వాగతం పలికి సత్కరించారు.