రైతులను జైలుకు పంపించడం హేయం: బీజేపీ

ABN , First Publish Date - 2021-06-22T05:27:03+05:30 IST

రైతులను జైలుకు పంపించడం హేయం: బీజేపీ

రైతులను జైలుకు పంపించడం హేయం: బీజేపీ

దౌల్తాబాద్‌: ఆరుగాలం కష్టించి పంటను సాగుచేసే రైతులను జైలుకు పంపించడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు శాంతికుమార్‌, నాగురావునామాజీ, రతంగ్‌పాండురెడ్డి అన్నారు. ఇటీవలే మండలంలోని బాలంపేట్‌ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన ఘర్షణలో రైతులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం సరైంది కాదన్నారు. బెయిల్‌పై వచ్చిన రైతులను సోమవారం వారు పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనను రైతులు ప్రశ్నించడంతో అక్రమ కేసులు నమోదుచేసి జైలుకు పంపించడం హేయమైన చర్య అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈసందర్బంగా పార్టీ నాయకులు కూరవెంకటయ్య, మదన్‌, పూనంచంద్‌లాహోటి, బాబయ్యనాయుడు, నర్సిములు, సతీశ్‌ ఉన్నారు. 

Updated Date - 2021-06-22T05:27:03+05:30 IST