ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-10-20T04:51:15+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం

శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల మేరకు... దుబాయ్‌ నుంచి ఈకే524 ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులు మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌కు చేరుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎమర్జెన్సీ ల్యాంప్‌ బాక్స్‌లో 6కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. పట్టుకున్న బంగారం విలువ రూ.2.79కోట్లు ఉంటుందన్నారు. బంగారాన్ని సీజ్‌ చేశామన్నారు. నిందితులను నగరంలోని కార్యాలయానికి తరలించినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-20T04:51:15+05:30 IST