ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

ABN , First Publish Date - 2021-11-01T04:58:55+05:30 IST

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయలో

ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
పట్టుబడిన విదేశీ కరెన్సీ

శంషాబాద్‌రూరల్‌: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి జీ9-459 విమానంలో ఆదివారం షార్జా వెళ్లడానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది తనిఖీల్లో అతడి బ్యాగులో రూ.10లక్షల విలువైన సౌదీ రియాల్స్‌ దొరికాయి. సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అప్పగించారు. సౌదీ కరెన్సీని సీజ్‌ చేశామని అధికారులు వెల్లడించారు.Updated Date - 2021-11-01T04:58:55+05:30 IST