ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-26T04:25:08+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో

ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ స్వాధీనం

శంషాబాద్‌రూరల్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న అలియా భాను అనే ప్రయాణికుడు ఈవై 275 విమానంలో సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు భాను బ్యాగును తనిఖీ చేయగా 50,500 సౌదీ రియాల్స్‌ పట్టుబడ్డాయి. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్‌ కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కరెన్సీని సీజ్‌ చేశామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. Updated Date - 2021-10-26T04:25:08+05:30 IST