షాద్‌నగర్‌లో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-10-26T04:23:58+05:30 IST
వలసకార్మికులే టార్గెట్‌గా గంజాయిని విక్రయిస్తున్న

షాద్‌నగర్‌రూరల్: వలసకార్మికులే టార్గెట్‌గా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలోని లోడిపూర్ గ్రామానికి చెందిన కలదీ్పకుమార్ సహాని(27) షాద్‌నగర్ మండలం మొగిలిగిద్ద శివారులోని కామధేను ఐరన్ పరిశ్రమ ఎదుట కిరాణ షాపులో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి అతని వద్ద నుంచి 61 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ధూల్‌పేటకు చెందిన హరిసింగ్ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు.