900కిలోల కల్తీ టీపౌడర్ పట్టివేత
ABN , First Publish Date - 2021-11-27T04:29:31+05:30 IST
900కిలోల కల్తీ టీపౌడర్ పట్టివేత

- పరిగి, షాద్‌నగర్‌లలో స్వాధీనం
- ముగ్గురిపై కేసు
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలో కల్తీ టీ పౌడర్ నిల్వ స్థావరంపై, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లలో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి రెండుచోట్ల 900కిలోల కల్తీ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. టీ పౌడర్ విక్రయించే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వివరాలను వికారాబాద్ ఎస్పీ నారాయణ శుక్రవారం రాత్రి వెల్లడించారు. పరిగిలోని ఇంద్రానగర్‌లో అద్దెకుంటున్న శెట్టిశ్రీను ఇంట్లో నకిలీ టీ పౌడర్ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి తనిఖీ చేశామన్నారు. శ్రీను ఇంట్లో 200 నకిలీ టీ పౌడర్ ప్యాకెట్లు లభించాయన్నారు. ఈ టీపౌడర్‌ను షాద్‌నగర్ నుంచి తెచ్చామని తెలిపారన్నారు. ఈ సమాచారంతో తాము షాద్‌నగర్‌కు వెళ్లి తనిఖీ చేయగా శెట్టి వీరబాబు, దెందుకూరి కొదండరామ సత్యనారాయణరాజు వద్ద 850కిలోల కల్తీ టీ పొడి లభించిందన్నారు. పరిగి, షాద్‌నగర్‌లలో మొత్తం 900 కిలోల కల్తీ టీ పౌడర్ లభించిందన్నారు. దీని విలువ రూ.3లక్షల వరకు ఉంటుంది. పరిగికి చెందిన శెట్టి శ్రీను, షాద్‌నగర్‌కు చెందిన శెట్టి వీరబాబు, దెందుకూరి కొదండరామ సత్యనారాయణరాజులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.